డబ్ల్యూటీసీ ఫైనల్లో కొత్త జెర్సీ ధరించనున్న టీమిండియా

టీమిండియా టెస్టు ఆటగాళ్ల జెర్సీ మారింది. ఇంగ్లండ్ గడ్డపై వచ్చే నెలలో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రూపొందించిన ఈ నూతన జెర్సీని పలువురు భారత ఆటగాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రదర్శిస్తున్నారు. పుజారా, రవీంద్ర జడేజా నూతన జెర్సీ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

జూన్ 18 నుంచి న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం త్వరలోనే ఇంగ్లండ్ పయనం కానున్న భారత బృందం ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్ లో ఉంది. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత అక్కడి నిబంధనల ప్రకారం మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు.

New Jersey
Team India
WTC Final
New Zealand
England

More Telugu News